Suriya: లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్..
ABN , Publish Date - Feb 06 , 2026 | 08:08 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు నటిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం విజయ్ దేవరకొండతో ద ఫ్యామిలీ స్టార్ సినిమాను తెరకెక్కించి పరాజయం పాలైన డైరెక్టర్ పరుశురామ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. ద ఫ్యామిలీ స్టార్ ని నిర్మించిన దిల్ రాజునే సూర్య - పరుశురామ్ సినిమాను కూడా నిర్మించనున్నాడని తెలుస్తోంది.
పరుశురామ్ కి ఇది చాలా మంచి ఛాన్స్. గీతగోవిందం తరువాత మహేష్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు. సర్కారు వారి పాట అంటూ వచ్చినా ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత విజయ్ దేవరకొండకు హిట్ ఇస్తాడు అనుకుంటే మరో ప్లాప్ ను అందించాడు. అయినా కూడా దిల్ రాజు పరుశురామ్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దిల్ రాజు సూర్య - పరుశురామ్ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఈసారైనా పరుశురామ్ హిట్ అందిస్తాడో లేదో చూడాలి.