ఆపరేషన్ అయినా తగ్గని బాలయ్య.. షూటింగ్ షురూ

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:42 PM

అసలు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కి ఉన్నంత మొండి పట్టుదల ఇంకెవరికీ ఉండదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Nandamuri Balakrishna

అసలు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కి ఉన్నంత మొండి పట్టుదల ఇంకెవరికీ ఉండదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏమైంది.. అంతలా బాలయ్య ఏం చేశాడు అంటే.. సాధారణంగా హీరోలకు గాయాలు అయితే ఆ షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. చాలా తక్కువమంది హీరోలు మాత్రమే ఆ గాయాలను లెక్కచేయకుండా నిర్మాతల గురించి ఆలోచిస్తారు. నటీనటుల డేట్స్, సెట్స్ ఇవన్నీ ఆగిపోతే నిర్మాతలకు నష్టమే. అలాంటి నష్టాన్ని బాలకృష్ణ కొత్త సినిమాకు ఇవ్వకూడదు అనుకున్నాడు. తాను లేకపోయినా షూటింగ్ మొదలుపెట్టి మిగతా నటీనటులతో సినిమాను ఫినిష్ చేయమని కోరాడట బాలయ్య.


ఇటీవల NBK 111 షూటింగ్‌లో బాలయ్యకు తీవ్ర గాయమవ్వడం, హైదరాబాద్‌లో ఆపరేషన్ కూడా జరగడంతో ఆయనకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోక తప్పలేదు. వేరే హీరో అయితే ఆరోగ్యం ముఖ్యం. సినిమా తరువాత అనుకుంటారు. కానీ, మొండి ఘటం. తాను ఎలా ఉన్నా కూడా షూటింగ్ ఫినిష్ చేసి అనుకున్న డేట్ న రిలీజ్ చేయాలని పట్టుపట్టాడట. ఎంత గాయమైనా, శస్త్రచికిత్స జరిగినా తన సినిమా షెడ్యూల్ మారడానికి వీల్లేదని టీమ్‌కు ఆదేశాలు జారీ చేశాడట. ఆపరేషన్ అయ్యాక తాను ఎన్నిరోజులు హాస్పిటల్ లో ఉండాలి.. ? ఎన్నిరోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి.. ? అనేవి వైద్యులను అడిగి.. తాను రాని రోజుల్లో మిగతా నటీనటులతో షెడ్యూల్ పూర్తిచేయమని గోపీచంద్ మలినేనికి హుకుం జారీ చేసినట్లు సమాచారం.


ఇక బాలయ్య తిరిగి సెట్ లో అడుగుపెట్టే సమయానికి కనీసంలో కనీసం షెడ్యూల్ లో సగం షూటింగ్ అయినా పూర్తిచేయమని చెప్పాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా డిసెంబర్ మూడో వారంలోనే సినిమా రిలీజ్ అవ్వాలని, ఇలాంటి గాయాలు తనేకమి కొత్తకాదని చెప్పినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ బాలయ్యకు ఎందుకు ఇంత మొండి పట్టుదల.. ఆరోగ్యం చూసుకోవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలయ్య ఎప్పుడు మళ్లీ సెట్ లో అడుగుపెడతాడో చూడాలి.

Updated Date - Jul 25 , 2026 | 09:49 PM