సురేఖావాణి రెండో పెళ్లి.. ఆమె ఏమన్నదంటే
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:56 PM
తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అక్కగా, తల్లిగా, వదినగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన నటి సురేఖావాణి(Surekhavani).
తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అక్కగా, తల్లిగా, వదినగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన నటి సురేఖావాణి(Surekha Vani). తన సహజసిద్ధమైన నటనతో సుదీర్ఘకాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుకుంది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో కలిసి విభిన్నమైన వీడియోలు, మోడ్రన్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే సురేఖావాణి ఇటీవల నీరమ్'అనే సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొని సోషల్ మీడియా ట్రోలింగ్‌పై అత్యంత ఘాటుగా స్పందించింది.
ఎప్పటినుంచో సురేఖావాణి రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె కూతురు సుప్రీత.. మా అమ్మకు రెండో పెళ్లి చేశాకే తాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం, తన తండ్రి స్థానంలో ఇంకొకరు ఉన్నారని చెప్పడంతో నిజంగానే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నారు. తాజాగా నీరమ్ ప్రెస్ మీర్ లో తన రెండో పెళ్లి రూమర్స్, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్లపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. "నా కుమార్తె సుప్రీతకు ఇప్పటికే పెళ్లి వయస్సు వచ్చింది.. ఇలాంటి సమయంలో నాకెందుకు మళ్లీ పెళ్లి' అని రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాలో తాము ఎంతో యాక్టివ్‌గా ఉంటామని, అయితే వచ్చే నెగిటివ్ కామెంట్లను తాము అస్సలు పట్టించుకోమని చెప్పుకొచ్చింది. అలాగే తాను సినిమాలకు ఏమాత్రం దూరం కాలేదని, తనకు తెలుగులో మంచి అవకాశాలు ఇవ్వాలని దర్శక నిర్మాతలను కోరాలని విజ్ఞప్తి చేసింది.
తన వ్యక్తిగత జీవితంపై ఇతరులు జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. 'ఏ పోస్ట్ పెట్టాలనిపిస్తే అది పెడతా, ఎలా ఫోటో దిగాలనిపిస్తే అలా దిగుతా.. అది నా ఇష్టం! చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, నేను ఏంటి.. నాకేంటి అనేది మాత్రమే చూసుకుంటాను. మొదట్లో నెగిటివ్ కామెంట్స్ చూసి బాధపడేదాన్ని కానీ, ఇప్పుడు పూర్తిగా పట్టించుకోవడం మానేశాను' అని ఆమె తేల్చి చెప్పింది. ప్రస్తుతం సురేఖావాణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.