బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:22 PM

నందమూరి బాలకృష్ణకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందించనుంది.

Balakrishna

నందమూరి బాలకృష్ణను (Nandamuri Balakrishna) సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Suravaram Pratap Reddy Telugu University) విశిష్ట పురస్కారంతో సత్కరించనుంది. కళారంగం నుంచి ఈ ఏడాది ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమా నటుడు, తెలుగు భాషాభిమానిగానే గాక బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ట్రస్టు బోర్డు చైర్మన్ గానూ బాలకృష్ణ అందిస్తోన్న సేవలను గుర్తిస్తూ.. ఆయన పేరును తెలుగు వర్సిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరొక రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ప్రతి ఏటా తెలుగు విశ్వవిద్యాలయం కళలు, సామాజిక సేవ, సాహిత్యం, సాంస్కృతిక, వైజ్ఞానిక తదితర రంగాల నుంచి ఒకరికి విశిష్ట పురస్కారాన్ని అందిస్తుం టారు. అది ఈ సారి బాలయ్యను వరించింది.

Updated Date - Nov 19 , 2026 | 11:22 PM