Mahesh Babu: అందమే అసూయ పడేలా .. ఏమున్నాడ్రా బాబు
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:54 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి వయస్సు పెరిగేకొద్ది అందం పెరిగే వరం ఏదైనా ఉందా అంటే.. నిజమే ఉండొచ్చు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి వయస్సు పెరిగేకొద్ది అందం పెరిగే వరం ఏదైనా ఉందా అంటే.. నిజమే ఉండొచ్చు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ, టాలీవుడ్ లోమహేష్ బాబు అందానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా మహేష్ న్యూ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మహేష్ బాబు, తన సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) తో కలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) ఇంట జరిగిన ప్రత్యేక ఫ్యామిలీ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలందరూ తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కింగ్ నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోలతో కలిసి మహేష్ బాబు ఎంతో ఉత్సాహంగా ముచ్చటిస్తూ కనిపించాడు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గుబురు గడ్డం , స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మహేష్ బాబు ఎఫర్ట్‌లెస్ స్వాగ్ అండ్ కాన్ఫిడెన్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, వైట్ క్యాప్ లో చలా సింపుల్ గా కనిపించినా కూడా ఆ ఈవెంట్ మొత్తానికి సెంట్రాప్ ఎట్రాక్షన్ గా నిలిచాడు మహేష్. నమ్రతా శిరోద్కర్ కూడా కుటుంబ సభ్యులు, అతిథులతో కలిసిపోతూ ఈ వేడుకకు మరింత వార్మ్ ఫ్యామిలీ వైబ్‌ను జోడించింది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో ఇలా సరదాగా గడపడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. ఏమున్నాడ్రా బాబు.. మహేష్ ని చూస్తే అందమే అసూయ పడుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఎనర్జీతో మహేష్ బాబు కనిపిస్తున్న ఈ కొత్త లుక్స్ వారణాసిపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.మరి ఈ సినిమాతో మహేష్ - రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.