Mahesh Babu: యో.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా..
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:46 PM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణసి (Varanasi) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెల్సిందే.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli)- మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణసి (Varanasi) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెల్సిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు మునుపెన్నడూ లేనివిధంగా కనిపించాడు. పొడువాటి జుట్టు, గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించాడు. ఎక్కడ కనిపించినా కూడా అదే లుక్ లోనే బాబు దర్శనమిచ్చాడు.
ఇక తాజాగా వారణాసికి సంబంధించిన కీలకమైన అండ్ మేజర్ పార్ట్ చిత్రీకరణను సూపర్ స్టార్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ తన మునుపటి లుక్ లోకి వచ్చేశాడు. షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో సూపర్ స్టార్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన జుట్టు, గడ్డం పూర్తిగా తీసేసి క్లీన్ షేవ్ లుక్‌లోకి మారాడు. చాలా కాలం తర్వాత తన పాత క్లాసిక్, కాన్ఫిడెంట్ అండ్ డాషింగ్ అవతార్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్ సందడిలో చాలా నార్మల్‌గా, లో-కీ వైబ్‌తో కనిపిస్తూనే తన కొత్త లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన 90 శాతానికి పైగా ప్రధాన చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో త్వరలోనే అత్యంత విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను, అలాగే గ్లోబల్ లెవెల్ ప్రమోషన్లను ప్రారంభించేందుకు రాజమౌళి అండ్ టీమ్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ సరికొత్త స్టైలిష్ అవతార్‌లోకి మారడం సినిమాపై ఆయన రోల్‌పై సరికొత్త చర్చలకు తెరలేపింది. సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు ఆయన కొత్త క్లీన్ షేవ్ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ క్లీన్ షేవ్ లుక్ లో అదిరిపోయాడు. ఈ లుక్ చూసి అభిమానులు అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అన్న.. ఇంత అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.