మ‌హేశ్ మేన‌కోడ‌లు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోందిగా

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:45 PM

సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఇటీవ‌ల తరుచూ వార్త‌ల్లో వినిపించ‌డం, కనిపించ‌డం అంద‌రికీ తెలిసిందే.

Jaanvi Swarup

సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) ఫ్యామిలీ ఇటీవ‌ల తరుచూ వార్త‌ల్లో వినిపించ‌డం, కనిపించ‌డం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా మ‌హేశ్ బాబు వార‌ణాసి సినిమా విష‌యంలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంటుంటే కూతురు సితార వివిధ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే దివంగ‌త ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ శ్రీనివాస మంగాపురం సినిమాతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Jaanvi Swarup

మ‌రోవైపు.. 2018లోనే మ‌న‌సుకు న‌చ్చింది (Manasuku Nachindi) సినిమాతో బాల న‌టిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేశ్ మేనకోడ‌లు మంజుల (Manjula) గారాల ప‌ట్టి జాన్వీ స్వ‌రూప్ (Jaanvi Swarup) సైతం క‌థానాయిక‌గా తెరంగేట్రానికి రెడీ అయిన విష‌యం తెలిసిందే.

Jaanvi Swarup

ఈ క్ర‌మంలోనే గ‌తంలో మంజుల స్వ‌యంగా జాన్వీ ఫొటోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుని అవ‌కాశాం వ‌స్తే రెడీ అన్న‌ట్లుగా సిగ్న‌ల్స్ ఇచ్చారు. కానీ ఏడాది అవుతున్నా సినిమాలో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు లేదు.

Jaanvi Swarup

ఈ నేప‌థ్యంలో.. తాజాగా జాన్వీ లేటెస్ట్ ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌గా క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయ్యాయి. ఈ చిత్రాల‌ను చూసిన వారంతా జాన్వీ అందంలో మామ‌నే మించి పోయేలా ఉంద‌ని హీరోయిన్ల‌ను మించి లుక్స్ ఉన్నాయంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. భ‌విష్య‌త్‌లోనైనా జాన్వీ సినిమాల‌లో క‌నిపించ‌క పోయినా సితార మాదిరి బ్రాండెడ్ యాడ్స్ చేస్తే బావుంటుంద‌ని కోరుతున్నారు. జాన్వీ ఫొటోల‌పై మీరూ ఓ లుక్ వేయండి.

Jaanvi Swarup

Updated Date - Jul 08 , 2026 | 06:06 PM