Super Subbu: సూప‌ర్ సుబ్బు టీజ‌ర్ అదిరింది! మామ అల్లుళ్ళుగా సందీప్‌, సంపూర్ణేశ్ అద‌ర‌గొట్టారుగా!

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:05 PM

కాస్త గ్యాప్ త‌ర్వాత సందీప్ కిష‌న్ న‌టించిన వెబ్ సిరీస్‌ సూప‌ర్ సుబ్బు నుంచి ఎట్ట‌కేల‌కు మ‌రో అప్డేట్ వ‌చ్చింది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ వెబ్ సీరిస్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు.

Super Subbu

కాస్త గ్యాప్ త‌ర్వాత సందీప్ కిష‌న్ (Sundeep Kishan) న‌టించిన వెబ్ సిరీస్‌ సూప‌ర్ సుబ్బు (Super Subbu). మిథిలా పాల్క‌ర్ (Mithila Palkar), మాన‌సా చౌద‌రి (Maanasa Choudhary) క‌థానాయిక‌లుగా న‌టించ‌గా బ్ర‌హ్మానందం, సంపూర్ణేశ్‌ బాబు, ముర‌ళీ శ‌ర్మ (Murli Sharm), ర‌చ్చ‌ ర‌వి కీల‌క పాత్ర‌ను పోషించారు. సుమారు ఏడాదిన్న‌ర‌గా తెర‌కెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌ నుంచి ఎట్ట‌కేల‌కు మ‌రో అప్డేట్ వ‌చ్చింది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ సిరీస్‌ టీజ‌ర్ విడుద‌ల చేశారు. సుమారు రెండు నిమిషాల సాగిన ఈ టీజ‌ర్ ఆద్యంతం కామెడీ పండిస్తూ పంచ్ డైలాగ్స్, సింగిల్ లైన‌ర్స్ తో అదిరిపోయింది.

గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం లేక కుమారుడికి వ‌చ్చిన పెళ్లి సంబంధాలు కుద‌ర‌క పోవ‌డంతో తండ్రి చివాట్లు పెడుతుంటాడు. దాంతో చివ‌ర‌కు ఓ ఉద్యోగం సంపాదించుకోగా.. దానిని ప‌ర్మినెంట్ చేసుకోవ‌డం కోసం మాకీపూర్ అనే ఊరికి వెళతాడు. అడ్డ‌గోలుగా పెరుగుతున్న ఆ ఊరి జ‌నాభాను త‌గ్గించేందుకు అక్క‌డి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకు వ‌చ్చే డ్యూటీ సుబ్బుకు ప‌డుతుంది. అక్క‌డికి వెళ్లిన సుబ్బుకు అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న వ‌చ్చింది, సుబ్బు ఎలా నెట్టుకొచ్చాడ‌నే క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సిరీస్ సాగ‌నున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్ద‌మ‌వుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Feb 04 , 2026 | 01:02 PM