Sundeep Kishan : సందీప్ కిషన్ 33.. ఫస్ట్ లుక్

ABN , Publish Date - May 07 , 2026 | 03:41 PM

సందీప్ కిషన్ (Sandeep Kishan) కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆయన నటిస్తున్న 33వ సినిమా ఇది.

సందీప్ కిషన్ (Sandeep Kishan) కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆయన నటిస్తున్న 33వ సినిమా ఇది. ‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని (Yugandhar Muni) దర్శకత్వం  వహిస్తున్న చిత్రమిది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది. గురువారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్‌ను  విడుదల చేసారు మేకర్స్. 


ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ సినిమాలాగా అనిపిస్తోంది. సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ విడుదల చేసిన  పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

Updated Date - May 07 , 2026 | 03:44 PM