సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న రోహన్, అరుణ్...
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:53 PM
మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'సమ్మర్ హాలిడేస్'. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని సమ్మర్ స్పెషల్ గా మే 1న విడుదల చేస్తున్నారు.
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni). ఆయన రీసెంట్ గా పంపిణీ చేసిన 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly) మూవీ ప్రేక్షకుల ఆదరణతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) పేరుతో కొత్త సినిమాను అందించేందుకు ధీరజ్ మొగిలినేని సిద్ధమవుతున్నారు. బుధవారం ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు.
మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ (Srikar) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ (Rohan Roy), మాస్టర్ అరుణ్ (Arun) కీలక పాత్రల్లో నటించారు. రోహన్ రాయ్ '90’s మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి హిట్ చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే త్వరలో విడుదల కాబోతున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రంలోనూ శివాజీ (Shivaji), లయ (Laya) కొడుకుగా రోహన్ రాయ్ నటించాడు. ఇక మాస్టర్ అరుణ్ '35 చిన్న కథ కాదు' సినిమాతో ఫేమ్ అయ్యారు. వీళ్లిద్దరికీ 'సమ్మర్ హాలిడేస్' మూవీ మరింత పేరు తీసుకురానుంది. మే 1న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతాన్ని అందిస్తుండగా, సాయి ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
