Mahendragiri Varahi Teaser: ఆ ఇంటికి అమ్మవారి శాపం.. 33 ఏళ్ళు దాటితే చావే
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:53 PM
టాలీవుడ్ నటుడు సుమంత్ (Sumanth) కథానాయకుడిగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ డివైన్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi).
టాలీవుడ్ నటుడు సుమంత్ (Sumanth) కథానాయకుడిగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ డివైన్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi). మధు కలిపు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ గోస్వామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మహేంద్రగిరి వారాహి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
టీజర్ విషయానికొస్తే.. మహేంద్రగిరి అనే గ్రామంలో వారాహి అమ్మవారి గుడి వెలుస్తుంది. ఆ ఊరిని ఏలే భూపతి మహారాజ్ అక్కడి ప్రజలను ఇబ్బందిపెడుతున్న సమయంలో.. గుడిలో ఒక బిడ్డ కనపడుతుంది. ఆమెకు ముత్యాలమ్మ అని పేరు పెట్టి దేవతగా పూజిస్తారు. అది తట్టుకోలేని భూపతి మహారాజ్.. ముత్యాలమ్మని చంపేస్తాడు. దీంతో కోపోద్రికురాలైన వారాహి అమ్మవారు.. భూపతి మహారాజ్ ఇంటికి శాపం పెడుతుంది. ఆ ఇంట్లో పుట్టిన వారసుడు 33 ఏళ్ళకు మించి బతకడు. అలా తరతరాలుగా వంశం వృద్ధి చెందని శాపగ్రస్తమైన ఇల్లుగా భూపతి మహారాజ్ ఇల్లు మిగిలిపోతోంది.
ఈ శాపం వెనుక ఉన్న రహస్యాన్ని, ఆ ఊరిలో జరుగుతున్న వరుస చావుల మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సుమంత్ అడుగుపెడతాడు. అసలు ఆ శాపం వెనుక కథ ఏంటి.. ? ఆ శాపం ఎప్పుడు పోతుంది.. ? సుమంత్ కి హెల్ప్ చేసే ఐశ్వర్య రాజేష్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి, ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉగ్రరూపం చూపించిన షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.అనుప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వారాహి మంత్రం టీజర్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుమంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.