మళ్లీ సూపర్ ఫామ్‌లోకి.. సుమంత్

ABN , Publish Date - Feb 10 , 2026 | 09:28 PM

ఆల్మోస్ట్ సుమంత్ కెరీర్ అయిపోయింది. ఇక సినిమాలు చేయలేరు అనుకున్నారు. చేసిన ప్రాజెక్టులు చేసినట్టే అడ్రస్ లేకుండా పోవడంతో కథ ముగిసినట్టే అని భావించారు. కానీ రీ-ఎంట్రీలో వస్తున్న ప్రాజెక్టులు చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.

sumanth

టాలీవుడ్‌ హీరో సుమంత్ (Sumanth) మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చేస్తున్నారు. ఇటీవల ఓటీటీలో 'అనగనగా'తో మంచి ఆదరణ పొందిన ఆయన.. తాజాగా ఓ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌తో బరిలోకి దిగుతున్నారు. సోషియో-ఫాంటసీ సూపర్‌ నేచురల్ జానర్‌లో‌ తన లేటెస్ట్ మూవీ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi) తో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ చిత్రం కొత్త గ్లింప్స్‌ తెగ ఆకట్టుకుంటోంది.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల బ్యానర్‌పై మధు కాలిపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ మహేంద్రగిరి ప్రాంతంలోని వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతుంది. పౌరాణిక అంశాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ స్థాయిలో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రూ. 20-25 కోట్ల మధ్య బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. ఇది సుమంత్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ మూవీగా నిలుస్తోంది. అంతేకాక సుమంత్ పాత్రను ప్రత్యేకంగా రూపొందించారని.. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇదే కాదు ఓ స్పెషల్ న్యూస్ కూడా వినిపిస్తోంది.

sumanth.jpg

యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తిసురేశ్ ఇందులో క్యామియోలుగా కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్. ఈ ఇద్దరి అప్పియరెన్స్‌లు సినిమా అట్రాక్షన్‌ను మరింత పెంచుతాయని అంచనా. ఓటీటీ మార్కెట్‌లో స్టార్ పవర్ ఉంటే డీల్స్ వాల్యూ గణనీయంగా పెరుగుతుందని.. అందుకే ఈ ఇద్దరి ప్రత్యేక పాత్రలను వ్యూహాత్మకంగా పొందు పరిచారని పరిశీలకు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నాయి. అలాగే పాన్ ఇండియా రేంజ్‌లో థియేట్రికల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా విడుదల తేదీ ప్రకటన రావచ్చు.

ఇదిలాఉంటే.. గ‌త ఏడాది అన‌గ‌న‌గా అనే ఎమోష‌న‌ల్ చిత్రంతో ఓటీటీలో సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న సుమంత్ ఇప్పుడు న్యూట‌న్ థ‌ర్డ్ లా అంటూ వైవిధ్య‌మైన థ్రిల్ల‌ర్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ మంచి హైప్స్ తీసుకు వ‌చ్చింది. ఇది చూసిన వారంతా సుమంత్ సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చాడు అంటూనెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 09:28 PM