Godari Gattupaina: సుమంత్ ప్రభాస్.. గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:59 PM
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన'. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), నిధి ప్రదీప్ ( Nidhi Pradeep) జంటగా జగపతి బాబు (Jagapathi Babu), లైలా, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం గోదారి గట్టుపైన (Godari Gattupaina). సుభాష్ చంద్ర (Subash Chandra) రచన చేసి, దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు ముస్తాబయింది. మే 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విడుదల చేసిన గ్లింప్స్, పాటలు ఒక దానిని మించి మరోటి మంచి రెస్పాన్స్ అందుకోగా, తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఔట్ అండ్ ఔట్ రూరల్ బ్యాగ్రౌండ్‌లో లవ్, కామెడీ జానర్‌లో తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.
ఆటో నడుపుకునే హీరో.. కాలేజీలో చదువుకునే కథానాయిక ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం. ఆపై కూతురిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తండ్రి ఆ ప్రేమకు అంగీకరించకపోవడం ఈ క్రమంలో ముగ్గురి నడుమ జరిగే ఎమోషనల్ జర్నీగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉండనున్నట్లు సన్నివేశాలు చూస్తుంటే అర్థం అవుతున్నాయి.
ముఖ్యంగా ఇంటికి వచ్చే టైం మారుతుంది.. ఇంటి తిండికి దూరం అవుతుంది.. అసలు ఏం జరుగోతోంది, నా కూతురుకి జీవితాంతం ప్రేమనే చూపించాలనుకున్నా అంటూ వచ్చే డైలాగులు తండ్రి ఎమోషన్‌ను బలంగా చూపేలా ఉన్నాయి. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్ వేయండి.