సుమంత్ ప్రభాస్ , సాయిలు కంపాటి సినిమా స్టార్ట్
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:40 PM
సుమంత్ ప్రభాస్, సాయిలు కంపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది.
సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai)తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సాయిలు కంపాటి (Saailu Kaampati) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై పుస్కూర్ రామ్మోన్‌రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో సదానంద్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించగా, దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హీరో అడివి శేష్ (Adivi Sesh) క్లాప్ ఇవ్వగా, తొలి షాట్‌కు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యం ఉంటుందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలిపింది.