'మేమ్ ఫేమస్' హీరో సెకండ్ మూవీ ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:30 AM
'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ సెకండ్ మూవీ 'గోదారి గట్టుపైన..'. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మే 8న విడుదల చేయబోతున్నారు.
తొలి చిత్రం 'మేమ్ ఫేమస్'తో యువతరానికి చేరువైన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. అదే 'గోదారి గట్టుపైన'. రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ రావు నిర్మించారు. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మే 8న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే... ఈ చిత్రం ప్రేక్షకులను లవ్, ఫ్యామిలీ మోషన్స్ కట్టిపడేసే అనుభూతిని అందించబోతోందని అర్థమౌతోంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్, సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ పోషిస్తున్నారు.