ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. సుమలతపై రఘు మాస్టర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:10 AM

ఇప్పుడే కాదు, ఎప్పుడైనా యూనియన్‌లో ఏం జరిగినా ప్రశ్నించడానికి మేం ముందుకొస్తాం’ అని రఘు మాస్టర్ అన్నారు.

Raghu Master

డ్యాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలతపై రఘు మాస్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘డ్యాన్సర్స్‌ అసోసియేషన్ (Dancers Association) అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు సుమలత (Sumalatha) ఒక్క మంచి పని కూడా చేయలేదు. పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పలు రకాల ఆరోపణలు చేసి మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారు’ అని రఘు మాస్టర్ (Raghu Master) అన్నారు. శనివారం డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్‌ జరిగింది.

ఇందులో పాల్గొన్న రఘు మాట్లాడుతూ ‘డ్యాన్సర్స్‌ అమోదంతో అక్టోబర్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా వచ్చింది. ఎన్నికల్లో సభ్యులు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఒకవేళ కోర్టు స్టే ఇస్తే మేం గౌరవిస్తాం. టాలీవుడ్‌ చాలా అందమైన ఇండస్ట్రీ. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సర్దుకుపోవాలి.

ఆ క్రమంలోనే ఈ నెల 23న ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మీటింగ్‌ జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా యూనియన్‌లో ఏం జరిగినా ప్రశ్నించడానికి మేం ముందుకొస్తాం’ అని అన్నారు. వందలాది మంది డ్యాన్సర్లు రఘు మాస్టర్‌ ఇంటికి వెళ్లి ప్రెసిడెంట్‌గా ఉండాలని కోరినట్టు సత్య మాస్టర్‌ తెలిపారు.

Updated Date - Sep 27 , 2026 | 10:10 AM