చరణ్ కోసం సుకుమార్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:07 PM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) పుష్ప 2 సక్సెస్ తరువాత రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Ram Charan

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) పుష్ప 2 సక్సెస్ తరువాత రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయి లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేదానిపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.


సుక్కు తన సినీ కెరీర్‌లో ఆర్య సినిమా నుంచి పుష్ప వరకు ఏ హీరోయిన్‌ను కూడా తన తదుపరి సినిమాల్లో రిపీట్ చేయలేదు. ప్రతి కొత్త ప్రాజెక్ట్‌కి ఒక కొత్త కథానాయికను ఎంచుకోవడమే ఆయన అలవాటుగామారింది. అయితే, ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే భారీ చిత్రం కోసం సుకుమార్ తన సెంటిమెంట్‌ను పక్కనపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుక్కు.. మరోసారి రష్మికను దింపుతున్నట్లు తెలుస్తోంది. చరణ్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం డైరెక్షన్ టీమ్‌లో పలువురి పేర్లు పరిశీలనలోకి రాగా, చాలామంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరును బలంగా ప్రతిపాదిస్తున్నారట. దీంతో చేసేది సుకుమార్ కూడా రష్మికకే ఓటు వేసినట్లు సమాచారం. ఇక ఆమెను లెక్కలోకి తీసుకోవడానికి కూడా కారణం లేకపోలేదు.


రామ్ చరణ్, రష్మిక ఇప్పటివరకు కలసి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక పక్కా ఫ్రెష్‌నెస్ ఇస్తుందని టీమ్ భావిస్తోంది. ఇంకోపక్క రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సినిమాకు ఆమె మార్కెట్ కూడా యాడ్ అవుతుంది. అందుకే సుక్కు కూడా రష్మికనే రీపీట్ చేయాలని చూస్తున్నాడట. ఒకవేళ రష్మికనే హీరోయిన్‌గా ఆఖరిగా లాక్ చేస్తే మాత్రం, సుకుమార్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక హీరోయిన్‌ను రిపీట్ చేసినట్లవుతుంది. మరి చరణ్ సరసన రష్మికను ఫిక్స్ చేసి సుకుమార్ తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

Updated Date - Jul 20 , 2026 | 06:08 PM