చాలా రోజుల తరువాత.. నా సినిమాకు ఓటీటీ నుంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:47 PM
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్ (Suhas), శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్.
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్ (Suhas), శివానీ నాగారం (Shivani Nagaram) జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్ (Hey Balwanth). గోపీ అచ్చర (Gopi Atchara) దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి (Narendra Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం నందిపాటి (Vamsi Nandipati) ఎంటర్‌టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తొలిసారిగా, వినూత్నంగా థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ (Thank You Meet Break Even Done) ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సందర్బంగా.. నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ''మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారు. ఓ మంచి సినిమా తీశానని అభినందించారు. కొన్ని థియేటర్స్‌కి వెళ్లి నేను ఆడియన్స్ మధ్యలో సినిమా చూశాను. సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇది ఎంతో సంతృప్తి నిచ్చింది. ఓ మంచి సినిమా తీశాననే భావన కలిగింది. తప్పకుండా సినిమా చూడని వాళ్లు అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను' అన్నారు. దర్శకుడు గోపీ అచ్చెర మాట్లాడుతూ ''ఈ మూవీ చూసిన అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌లో ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికి నా కృతజ్క్షతలు' అన్నారు.
హీరోయిన్ శివానీ నాగారం మాట్లాడుతూ ఈసినిమాకు విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్క్షతలు. మా కంటెంట్‌ను ఎంకరైజ్ చేసి లవ్ చేసిన అందరికి థ్యాంక్స్. అందరికి నచ్చే కంటెంట్ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అంటున్నారు. సినిమా కోసం టీమ్ అంతా కష్టపడ్డారు' అన్నారు. చివరగా సుహాస్ మాట్లాడుతూ 'అంబాజీ పేట సినిమా తరువాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్ నెంబర్లు కూడా కనబడకపోవడంతో భయమేసింది. ఈసినిమా వసూళ్లు చూసిన ధైర్యం వచ్చింది. ఓవరసీస్‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. చాలా రోజుల తరువాత నా సినిమా ఓటీటీ కూడా మంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది. ఇందుకు కారణమైన నిర్మాత నరేంద్ర రెడ్డి, వంశీ నందిపాటిలకు థ్యాంక్స్' అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ '' చాలా హ్యపీగా ఉంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావడం నాకు ఎంతో హ్యపీనెస్ ఇచ్చే విషయం. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యిందని దైర్యంగా చెబుతారు.అలాంటి కోవలోకి మా హే బల్‌వంత్ నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలుస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా విజయం సాధించింది. త్వరలోనే దర్శకుడు గోపీతో మరోసినిమా చేస్తున్నాం. ఈ సినిమాను దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ జోన్‌లోకి వెళతాం అన్నారు.