Hey Bhagawan: సుహాస్.. హే భగవాన్ టీజర్! నవ్వించి చంపేసేలా ఉన్నారుగా
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:52 PM
కాస్త గ్యాప్ తర్వాత యువ నటుడు సుహాస్ (Suhas) నటిస్తోన్న చిత్రం ‘హే భగవాన్’ టీజర్ బుధవారం రిలీజ్ చేశారు.
కాస్త గ్యాప్ తర్వాత యువ నటుడు సుహాస్ (Suhas) నటిస్తోన్న చిత్రం ‘హే భగవాన్’ (Hey Bhagawan). శివాని నగరం (Shivani Nagaram) కథానాయికగా నటిస్తోండగా నరేశ్, సుదర్శన్, స్రవంతి చొక్కారపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించగా గోపి అచ్చర (Gopi Atchara) దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ టీజర్ విడుదల చేశారు.
తాజాగా.. రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం నవ్వులు పంచుతూ హుషారుగా సాగింది. చిన్నప్పటి నుంచే హీరో తనకు ఉద్యోగాలు చేయాల్సిన పని లేదని తండ్రి బిజినెస్ చూసుకుంటే సరిపోతుందంటూ సరదాగా గడిపేస్తుంటాడు. అయితే తండ్రి చేసే వ్యాపారం ఏంటో బయటకు చెప్పకుండానే పలు రకాల పేర్లు చెబుతూ చివరి వరకు కంటిన్యూ చేశారు.
ఈ క్రమంలో అది ఎలాంటి వ్యాపారమైనా చేస్తానని వెనకడుగు వేయనంటూ హీరో చెప్పడం ఫన్నీగా సాగింది. టీజర్ క్లైమాక్స్‌లో హీరో బామ ఉండి మా వాడు ఎందరో ఇండ్లలో దీపాలు వెలిగించాడు అంటూ అనడం మరో క్యారెక్టర్ ఓహో జనరేటర్‌లు అద్దెకిస్తాడా అంటూ నవ్వులు పూయించారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 20 న ప్రపంచ వ్యాప్తంగాథియేటర్లకు రానుంది.