సుడిగాలి సుధీర్ సినిమా వస్తోందట!

ABN , Publish Date - Mar 11 , 2026 | 01:24 PM

జబర్దస్త్‌ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గోట్' సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

Sudigali Sudheer

ప్రముఖ హాస్య కథానాయకుడు, జబర్దస్త్‌ ఫేమ్ సుడిగాలి సుధీర్ (Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గోట్‌' (Goat). గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 26న జనం ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. దాంతో త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


WhatsApp Image 2026-03-11 at 12.34.31 PM.jpeg

ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ, 'ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కించాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకంకముంది' అని అన్నారు. ఇతర ప్రధాన పాత్రలను సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు పోషించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చగా, మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్.

Updated Date - Mar 11 , 2026 | 01:24 PM