Sudigali Sudheer: గోట్ చిత్రం నుంచి రైజ్ ఆఫ్ గణ లిరికల్ వీడియో
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:13 PM
సుడిగాలి సుధీర్ (Sudigali Sudeer)హీరోగా నటిస్తున్న చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ (Vedavyas) దర్శకుడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudeer)హీరోగా నటిస్తున్న చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ (Vedavyas) దర్శకుడు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రైజ్ ఆఫ్ గణ అనే లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు, ఇటీవల సీఎమ్‌ఆర్ ఇంజనీరింగ్ కళాళాలలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు.
నిర్మాత మాట్లాడుతూ 'ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఈరోజు విడుదల చేసిన ఈ పాట కూడా ఎంతో రిచ్‌గా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.