ఆ నటితో సుడిగాలి సుధీర్ పెళ్లి

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:35 PM

బుల్లితెరపై ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) వ్యక్తిగత జీవితం మరోసారి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సుధీర్, రష్మీ (Rashmi Gautam) జంటకు సంబంధించిన ప్రేమాయణం, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

sudigali sudheer

బుల్లితెరపై ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) వ్యక్తిగత జీవితం మరోసారి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సుధీర్, రష్మీ (Rashmi Gautam) జంటకు సంబంధించిన ప్రేమాయణం, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంతకాలంగా ఈ క్రేజీ జంట విడిగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, తాజాగా సుధీర్ పేరు మరో సీరియల్ నటి కావ్యశ్రీతో తెరపైకి రావడం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.


సరికొత్తగా ప్రసారమవుతున్న సుమా హోస్ట్ చేస్తోన్న చెఫ్ మంత్ర షోకి సుడిగాలి సుధీర్ గెస్ట్ గా విచ్చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటిలందరిని మీ మీద వచ్చిన గాసిప్ ఏంటి అని సుమ అడగ్గా.. ఆమె 'సుధీర్, నేను పెళ్లి చేసుకోబోతున్నాం' అని గాసిప్ విన్నాను అని చెప్పింది. దానికి వెంటనే స్పందించిన సుధీర్.. 'ఆ గాసిప్‌ను ఇప్పుడు నిజం చేద్దాం' అంటూ ఇచ్చిన రిప్లై ఆ షోకి హైలైట్‌గా నిలిచింది. ఆ తరువాత వీరిద్దరూ ఒక సాంగ్ కి డ్యాన్స్ కూడా వేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సుధీర్, కావ్యల పేర్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.


మొదటి నుంచి సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను అభిమానులు ఎంతగానో ఓన్ చేసుకున్నారు. కానీ, కాలక్రమేణా వీరిద్దరూ కలిసి కనిపించడం తగ్గించడం, ఎవరి కెరీర్‌లో వారు బిజీ కావడంతో విడిపోయారనే టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు సడన్‌గా సుధీర్ పేరు సీరియల్ నటి కావ్యతో జతకట్టడం, పైగా షోలో వారిద్దరూ చేసిన కామెంట్లు చూస్తుంటే.. ఇదంతా కేవలం ఫన్ కోసం అన్నట్లు ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం దీన్ని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సుధీర్, కావ్య జోడీ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - Oct 24 , 2026 | 09:40 PM