బండోడు.. బక్కోడు కలిసి వాయించేశారుగా
ABN , Publish Date - May 26 , 2026 | 09:41 PM
సాధారణంగా ఇండస్ట్రీలో ట్రోల్స్ అనేవి సాధారణం. ముఖ్యంగా ఈ మధ్య నటీనటులు అనే కాదు.. ఎవరినైనా బాడీ షేమింగ్ చేయడం అలవాటుగా మారిపోయింది.
సాధారణంగా ఇండస్ట్రీలో ట్రోల్స్ అనేవి సాధారణం. ముఖ్యంగా ఈ మధ్య నటీనటులు అనే కాదు.. ఎవరినైనా బాడీ షేమింగ్ చేయడం అలవాటుగా మారిపోయింది. కానీ, కొంతమంది మాత్రం ఆ బాడీ షేమింగ్ ని ట్రోల్స్ గా తీసుకోకుండా ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటారు. అలాంటివారిలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar) ముందు ఉంటారు. టాలీవుడ్‌లో కాస్త బొద్దుగా ఉండే థమన్‌ను, లీన్‌గా ఉండే అనిరుధ్‌ను నెటిజన్లు బండోడు.. బక్కోడు అని సరదాగా అలా పిలుస్తూ మీమ్స్ వేస్తుంటారు.
ఇక ఇప్పుడు ఆ మీమ్స్ నే వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ కోసం వాడడం ఆశ్చర్యంగా ఉంది. అనీష్ హీరోగా మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇట్లు అర్జున. న్యూ గాయ్ ఇన్ టౌన్ పేరుతో మొదటి నుంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాను వెంకీ కుడుముల నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అనీష్ సరసన అనస్వర రాజన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఇట్లు అర్జున నుంచి మొదటి సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ కంపోజ్ చేయగా.. మరో స్టార్ కంపోజర్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను ఆలపించడం విశేషం. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే పాట కోసం చేతులు కలపడంతో ఈ సాంగ్ ప్రోమోపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు తగ్గట్లే ప్రోమో మొదట్లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ హైలైట్ గా మారింది. ఎవరిదగ్గరకు వెళ్తున్నారు సార్ అని అనిరుధ్ ని అడిగితే.. బండోడు దగ్గరికి అని.. పాడడానికి ఎవరు వస్తున్నారు అంటే బక్కోడు అని థమన్ చెప్పడం హైలైట్ గా మారింది. తమను తామే ట్రోల్ చేసుకొని సాంగ్ కి మరింత హైప్ ఇచ్చారు.
ఇక సాంగ్ విషయానికొస్తే హాయ్ రే అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించాడు. థమన్ మ్యూజిక్.. అనిరుధ్ వాయిస్.. రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది అంతే. ఫుల్ సాంగ్ మే 28 న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో కొత్త కుర్రాడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.