'వారణాసి' స్టోరీ లీక్.. కథ మామూలుగా లేదుగా!
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:58 PM
తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని ఎలాగైతే విభజించామో.. ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమాతో టోటల్ వరల్డ్ సినిమాను టాలీవుడ్ వైపు తిప్పుకోబోతున్నారు జక్కన్న.
తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని ఎలాగైతే విభజించామో.. ఇప్పుడు రాజమౌళి (SS Rajamouli) - మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి (Varanasi) సినిమాతో టోటల్ వరల్డ్ సినిమాను టాలీవుడ్ వైపు తిప్పుకోబోతున్నారు జక్కన్న. గతేడాది విడుదలైన ప్రీ-గ్లింప్స్‌తోనే ఈ సినిమా క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణతో పాటు ఎస్.ఎస్. కార్తికేయ ఏకంగా 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు.
షూటింగ్ అప్‌డేట్స్ విషయానికి వస్తే.. రాజమౌళి గారు ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేయడం విశేషం. ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంకా మహేష్ బాబుపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకే హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వారణాసి కథకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కుంభ (Kumbha) గా ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారట. తన మిత్రుడికున్న శారీరక వైకల్యాన్ని పోగొట్టడం కోసం రుద్ర చేసే అన్వేషణే ఈ సినిమా మెయిన్ ప్లాట్ అని టాక్. ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని, ఒకానొక సమయంలో కుంభ మోసం చేయడంతో.. మళ్లీ అతడితోనే రుద్ర పోరాడాల్సి వస్తుందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పాయింట్స్ గతంలో వచ్చినా.. రాజమౌళి గారి మేకింగ్, ఆయన ఇచ్చే ఎమోషనల్ టచ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయి. ఒక సాదాసీదా కథను సైతం వెండితెరపై అద్భుతంలా ఆవిష్కరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఇక ఈ సినిమాలో అసలైన సర్‌ప్రైజ్ ఏంటంటే.. మహేష్ బాబు సుమారు 30 నిమిషాల పాటు రాముడిగా కనిపించబోతున్నారట. ప్రస్తుతం దేశంలో ఉన్న ట్రెండ్ దృష్ట్యా ఈ ఎపిసోడ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌లో పురాణ ఇతిహాసాలను జోడించి జక్కన్న చూపిస్తున్న ఈ మ్యాజిక్ కోసమే అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు రేంజ్‌ను టాలీవుడ్ స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడానికి జక్కన్న వేసిన ప్లాన్ అదిరిపోయింది. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉండటం ప్లస్ పాయింట్. మరి ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.