Vaaranaasi: వారణాసి వాయిదా.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:56 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) జంటగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి (Vaaranaasi).
Vaaranaasi: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) జంటగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి (Vaaranaasi). ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ రాముడిగానే కాకుండా మరో నాలుగు అవతారాల్లో కనిపిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం వారణాసి కోసం ఎదురుచూస్తోంది.
వారణాసి ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను ఫినిష్ చేసుకుంటుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మేకర్స్ అధికారికంగా 2027 లో వారణాసి రిలీజ్ కానుందని తెలిపారు. ఇక ఈ సినిమాకు పోటీగా ప్రభాస్ స్పిరిట్ దిగుతుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 న రిలీజ్ కానుందని వంగా అధికారికంగా తెలిపాడు. దీంతో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్.. స్పిరిట్ వస్తుందని వారణాసి వాయిదా పడుతుందని రూమర్స్ సృష్టించారు.
ఇక వారణాసి వాయిదా అంటూ వస్తున్న వార్తలపై జక్కన్న ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు. వారణాసి గ్లింప్స్ లోని రాముడు.. హనుమంతుడు ఉన్న వీడియోను పోస్ట్ చేస్తూ 2027 వస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కచ్చితంగా సమ్మర్ లోనే వారణాసి దిగుతుందని క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక మరొక కారణం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది శ్రీరామనవమి కానుకగా మార్చి 26 న వారణాసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారని, అందుకే ఇలా హింట్ ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో అనేది తెలియాలంటే వారణాసి రిలీజ్ డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే.