'ధర్మస్థల నియోజవర్గం'లో శ్రష్టి వర్మ ఆటాపాటా!
ABN , Publish Date - Feb 16 , 2026 | 06:16 PM
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఇప్పుడు ఐటమ్ గర్ల్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'ధర్మస్థల నియోజక వర్గం'లో ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'ధర్మస్థల నియోజక వర్గం'. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అతి త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ను ప్రారంభించబోతున్నామని మేకర్స్ తెలిపారు. అందులో మొదటగా ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్సర్ శ్రష్టి వర్మ నటించిన ఐటమ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమాతో ఐటమ్ గర్ల్ గా శ్రష్టి వర్మ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోందని, 'న్యాయం చేయరా దేవుడా' అంటూ సాగే ఈ పాటను ఇదే వారం రిలీజ్ చేస్తామని వారు అన్నారు.
చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, 'ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌తో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ సాంగ్‌లో శ్రష్టి వర్మ స్టెప్స్ అందరినీ కనువిందు చేయనున్నాయి. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’ అని తెలిపారు.