Srinath Maganti: 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో..
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:39 PM
'హిట్' ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti). 'లక్కీ భాస్కర్'లోనూ సూరజ్ పాత్రతోను మెప్పించారు.
'హిట్' ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti). 'లక్కీ భాస్కర్'లోనూ సూరజ్ పాత్రతోనూ మెప్పించారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్'తో (Animal) బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. అందులో రష్మిక బ్రదర్ రోల్ చేశారు. ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించనున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కల్ట్ ఫిల్మ్ 'ఈ నగరానికి ఏమైంది' (Ee Nagaraniki Emaindi 2). ఆ సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే కథతో 'ఈ నగరానికి ఏమైంది' తీశారు తరుణ్ భాస్కర్. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. 'ఈ నగరానికి ఏమైంది 2' స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. హీరోల్లో ఆయన కూడా ఒకరు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్, 'ఈ నగరానికి ఏమైంది 2'లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ తెలిపారు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. చిత్ర నిర్మాత సృజన్ యరబోలు సైతం ఈ అంశాన్ని పాజిటివ్ గా తీసుకుని, తాము ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. నటుడు సుశాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ రోల్ శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారా? లేదా? అనేది మాత్రం ఈ ఇద్దరూ చెప్పలేదు!