హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఒక కోర్టు కేస్’ టీజర్ లాంచ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 08:21 AM
ప్రేమలో మోసపోయిన యువకుడు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘ఒక కోర్టు కేస్’ టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
ప్రేమలో మోసపోయిన యువకుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే కథాంశంతో తెరకెక్కుతోంది ‘ఒక కోర్టు కేస్’ (Oka Court Case) అనే చిత్రం. సూర్యాన్ష్ (Suryaansh), తనిషా మిశ్రా (Tanisha Mishra) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో గణేశ్ పూడి తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ (Srikanth) విడుదల చేశారు. ‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రేమలో జరిగే సంఘటనలను లీగల్ డ్రామాగా మలచడం ఉత్కంఠగా అనిపించింది. సినిమా మంచి విజయం సాధించాలి’ అని శ్రీకాంత్ అన్నారు.

దర్శకుడు, నిర్మాత గణేశ్ పూడి మాట్లాడుతూ ‘‘ప్రతి ప్రేమికుడికి తన ప్రేమ కోసం పోరాడే హక్కు ఉంది’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ సినిమా ప్రధానంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే అంశాన్ని కూడా చూపిస్తుంది’ అని తెలిపారు. నా కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని హీరో సూర్యాన్ష్ అన్నారు. ప్రేమ, భావోద్వేగాలు, సంఘర్షణలతో ఉండే నా పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని తనిషా మిశ్రా తెలిపారు.