Vamsy Thummala: మెల్లకన్ను ఉంటే తప్పేంటీ!?
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:30 PM
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన 'శ్రీ చిదంబరం గారు' మూవీ ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన సినిమా 'శ్రీ చిదంబరం గారు'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, కీరవాణి పాడిన పాట విడుదలై వ్యూవర్స్ లో ఆసక్తిని కలిగించాయి. దానిని రెట్టింపు చేసేలా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను వినయ్ రత్నం దర్శకత్వంలో చింతా వినీష రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న మూవీ రిలీజ్ కాబోతోంది. బుధవారం మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన 'పెద్ది' సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
'శ్రీ చిదంబరం గారు' మూవీ ట్రైలర్ చూస్తే... గ్రామీణ నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా దర్శకుడు చాలా సహజంగా ఈ పాత్రలను తీర్చిదిద్దారు. కమర్షియల్ కంటెంట్ తో పాటు ఓ చక్కని సందేశాన్ని దర్శకుడు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అంతా కొత్తవాళ్లతో తీసిన సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న చిత్రం. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఇది ఎంతో స్ఫూర్తిని అందిస్తుంది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే సినిమా ఇది' అని అన్నారు. ఈ సినిమాలో గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. చందు రవి ఈ సినిమాకు సంగీతం అందించారు.