శ్రీలీల బ్యాడ్ టైమ్.. అజిత్ సినిమా కూడా అవుట్
ABN , Publish Date - Jul 15 , 2026 | 07:09 PM
ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరోయిన్ గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది.. ఏ హీరోయిన్ ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది అని చెప్పడం చాలా కష్టం. ధమాకా లాంటి హిట్ తరువాత శ్రీలీల (Sreeleela)ను అందరూ గోల్డెన్ లెగ్ అని పిలిచారు.
ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరోయిన్ గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది.. ఏ హీరోయిన్ ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది అని చెప్పడం చాలా కష్టం. ధమాకా లాంటి హిట్ తరువాత శ్రీలీల (Sreeleela)ను అందరూ గోల్డెన్ లెగ్ అని పిలిచారు. ఒకటి కాదు రెండు కాదు అరడజను సినిమాలు చేతిలో పెట్టుకొని.. అది కూడా అందరూ స్టార్ హీరోల పక్కనే నటించింది. ఇంకేముంది ఈ చిన్నదే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి. అవకాశాలు అందుకుంది కానీ.. పాపం శ్రీలీల విజయాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.
ఇక లెనిన్ లో కనుక ఈ చిన్నది నటించి ఉంటే మంచి హిట్ అయినా అందుకొనేది. కానీ, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. వేరే బాలీవుడ్ సినిమా కోసం శ్రీలీల తల్లి లెనిన్ ని పక్కన పెట్టమందని, అందుకే శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు శ్రీలీల వెండితెరపై కనిపించింది లేదు. టాలీవుడ్ సెట్ కాలేదని కోలీవుడ్ కి వెళ్ళింది. పరాశక్తిలో అమ్మది నటన బావున్నా హిట్ మాత్రం దక్కలేదు. కానీ, అజిత్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది.
అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా ఒక మంచి హిట్ కోసమే ఇద్దరూ కష్టపడుతున్నారని టాక్. అందులో శ్రీలీల కూడా జాయిన్ అయ్యిందని తెలియడంతో తెలుగు అభిమానులు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. అయితే అజిత్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్‌ను శ్రీలీల వదులుకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అజిత్ లాంటి స్టార్ సినిమా ఆఫర్ ను వదులుకొని శ్రీలీల కెరీర్ పరంగా పెద్ద తప్పుచేసిందంటూ అప్పుడే కోలీవుడ్ సినీ సర్కిల్స్ లో తీవ్రమైన రచ్చ మొదలైంది.
అయితే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుండి శ్రీలీల తప్పుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. శ్రీలీల చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉండటం వల్ల.. డేట్స్ సర్దుబాటు చేయలేక, కాల్షీట్ల ప్రాబ్లమ్ తోనే ఆమె స్వచ్ఛందంగా ఈ సినిమా నుంచి తప్పుకుందా? లేక అమ్మడి ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ చూసి చిత్ర యూనిట్ కావాలనే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. కాల్షీట్ల సమస్యే నిజమైతే పరవాలేదు కానీ, మరేదైనా కారణంతో ఈ ప్రాజెక్ట్ చేజారితే మాత్రం అది శ్రీలీల తమిళ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై శ్రీలీల టీమ్ లేదా చిత్ర యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.