Mrithyunjay: రూట్ మార్చిన.. శ్రీ విష్ణు! ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. ‘మృత్యుంజయ్’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Feb 05 , 2026 | 09:25 PM

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న శ్రీవిష్ణు కాస్త గ్యాప్ త‌ర్వాత రూట్ మార్చి న‌టించిన చిత్రం ‘మృత్యుంజయ్’.

Mrithyunjay

కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా గుర్తింప‌ను సంపాదించుకుని ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న శ్రీవిష్ణు (Sree Vishnu) కాస్త గ్యాప్ త‌ర్వాత రూట్ మార్చి న‌టించిన చిత్రం ‘మృత్యుంజయ్’(Mrithyunjay). ఇప్ప‌టివ‌ర‌కు యూత్, కామెడీ సినిమాల‌తో అల‌రించిన ఈ హీరో ఇప్పుడు ఫ‌స్ట్ టైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌థో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.

హుస్సేన్ షా కిర‌ణ్ (Hussain Sha Kiran) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ర‌మ్య గున్నం (Ramya Gunnam) స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం (Sandeep Gunnam), వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత రేబా మోనికా జాన్ (Reba Monica John) మ‌రోసారి శ్రీ విష్ణు స‌ర‌స‌న క‌థానాయిక‌గా చేస్తోంది.

Mrithyunjay

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుంచి ఎలాంటి ఆప్డేట్స్ లేక‌పోవ‌డంతో వేస‌విలో వ‌స్తెందేమో అనుకుంటున్న స‌మ‌యంలో స‌డ‌న్‌గా ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్ర‌క‌టించి మేక‌ర్స్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. పేప‌ర్ల‌తో నిండిన రోడ్డుపై శ్రీవిష్ణు ఒంట‌రిగా నిల‌బ‌డి ఉండి దేని కోస‌మో వెతుకుతున్న‌ట్లుగా ఉండి ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇదిలాఉంటే శ్రీ విష్ణు న‌టించిన మ‌రో చిత్రం విష్ణు విన్యాసం (Vishnu Vinyasam) ఈ నెల‌లోనే రిలీజ్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్ స‌డ‌న్‌గా ఈ మూవీ రిలీజ్ కానుండ‌డంతో ఇప్పుడు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఈ విష్ణు విన్యాసం చిత్రం వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా వర్క్ చేయ‌గా, కాల భైర‌వ సంగీతం స‌మ‌కూర్చాడు.

Updated Date - Feb 05 , 2026 | 09:25 PM