సినిమా లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.. అందుకే వెంట‌నే రిలీజ్ చేశాం

ABN , Publish Date - Mar 01 , 2026 | 08:22 AM

విష్ణు విన్యాసం సినిమాను కొందరు లీక్ చేసి నిర్మాతను బ్లాక్ మెయిల్ చేశారు. లీక్‌ని ఆరికట్టి థియేటర్లలో విడుదల చేశాం అని అన్నారు శ్రీ విష్ణు.

sree vishnu

విష్ణు విన్యాసం (Vishnu Vinyasam) సినిమాను కొందరు లీక్ చేసి నిర్మాతను బ్లాక్ మెయిల్ చేశారు. లీక్‌ని ఆరికట్టి థియేటర్లలో విడుదల చేశాం. సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ కుటుంబ ప్రేక్షకులు, యువతను దృష్టిలో ఉంచుకునే సినిమాలు చేస్తాను' అని అన్నారు శ్రీ విష్ణు (Sree Vishnu). ఆయన కథానాయకుడిగా యధునాథ్ మారుతీరావు (Yadunaath Maruthi Rao) తెరకెక్కించిన చిత్రమిది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అనంత‌రం నయన్ సారిక (Nayan Sarika) మాట్లాడుతూ 'సినిమా ప్రథమార్థం యువతకు, ద్వితీయార్థం అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది' అని చెప్పారు.


నిర్మాత సుమంత్ నాయుడు మాట్లాడుతూ 'కుటుంబ సభ్యులంతా కలసి చూడాల్సిన చిత్రమిది. నిన్నటితో పోల్చితే ఈ రోజు కలెక్షన్లు పెరిగాయి' అని చెప్పారు. మరో నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ "మృత్యుంజయ్' చిత్రానికి పోటీగా తీసుకురావాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆ చిత్ర నిర్మాత మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని అన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 08:22 AM