‘మృత్యుంజయ్‌’.. ఓ అరుదైన థ్రిల్లర్‌ మిస్‌ కావద్దు

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:49 AM

‘మృత్యుంజయ్‌’.. ఓ అరుదైన థ్రిల్లర్‌. మిస్‌ కావద్దని కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నారు.

‘మృత్యుంజయ్‌’ను చూసిన ప్రేక్షకులంతా ఓ కొత్త సినిమాను చూశామన్న అనుభూతికి లోనవుతున్నారు. దర్శకుడు హస్సేన్‌ షా కిరణ్‌ రచన, టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసినవారంతా గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇదో అరుదైన థ్రిల్లర్‌. మిస్‌ కావద్దు’ అని కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నారు.

ఆయన కథానాయకుడిగా హుస్సేన్‌ షా కిరణ్ (Hussain Sha Kiran) తెరకెక్కించిన ‘మృత్యుంజయ్‌’ (Mrithyunjay) ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాతలు సందీప్‌ గుణ్ణం (Gunnam Sandeep), వినయ్‌ చిలకపాటి మాట్లాడుతూ ‘మొదటి ఆట నుంచి ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకొంది. ఈ చిత్రానికి దక్కిన విజయం టీమ్‌కు అంకితం.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు సంతృప్తిగా ఉంది’ అని చెప్పారు. ఎంతోమంది హీరోల‌కు ఈ క‌థ చెప్పాన‌ని అంద‌రికీ న‌చ్చేద‌ని కానీ ముందుకు వెళ్ల‌లేద‌ని, శ్రీ విష్ణు వ‌ద్ద‌కు వ‌చ్చాకే ఈ సినిమా తెర మీద‌కు వ‌చ్చిందంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ‘ఈ సినిమా కోసం శ్రీవిష్ణు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన అద్భుతమైన నటన ఈ చిత్రం విజయానికి దోహద పడింది’ అని హుస్సేన్‌ షా కిరణ్‌ తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 07:49 AM