ఈసారి నవ్వించడానికి 'ఫ్యామిలీ ప్యాక్' తో వస్తోన్న శ్రీవిష్ణు

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:22 PM

సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు, టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కలయికలో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే.

Family Pack

సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు (Sree Vishnu), టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు (Ram Abbaraju) కలయికలో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన సాక్షి మండోద్కర్ నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోండగా.. సామజవరగమన చిత్రానికి అద్భుతమైన సంభాషణలు, కథ అందించిన భాను భోగవరపు, నందు సవిరిగాణ స్క్రిప్ట్ అందించడం విశేషం.


ఇక నేడు వినాయక చవితి పర్వదినాన.. ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్యాక్ అనే విభిన్నమైన టైటిల్ ని ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో కలర్‌ఫుల్‌గా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఇంట్లోని మెట్ల మధ్యలో శ్రీవిష్ణు విచిత్రమైన భంగిమలో గాల్లో తేలుతూ పడిపోతున్నట్లు ఉండగా, ఆయన చుట్టూ రూపాయి నోట్లు వర్షంలా కురుస్తున్నాయి. పోస్టర్‌లో ఇతర నటీనటులు విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్లతో కనిపించడం చూస్తుంటే, ఈ సినిమా పూర్తి స్థాయి అవుట్ అండ్ అవుట్ హలేరియస్ అండ్ క్రేజీ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.


సామజవరగమన తరువాత మళ్లీ అదే హిట్ కాంబినేషన్ కుదరడం, దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర సంస్థ తోడవడంతో ఫ్యామిలీ ప్యాక్ చిత్రంపై టాలీవుడ్‌లో ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, రామ్ అబ్బరాజు మార్క్ మార్క్ నవ్వుల విందు సంక్రాంతి రేసులో ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి శ్రీవిష్ణు ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 12:22 PM