శ్రీవిష్ణు: రెండు రోజులు.. రెండు సినిమాలు.. తనకు తానే పోటీ..

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:23 PM

శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి ‘మృత్యుంజయ్‌’. మరొకటి ‘విష్ణు విన్యాసం’. ఈ రెండు చిత్రాలు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.


శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి ‘మృత్యుంజయ్‌’. మరొకటి ‘విష్ణు విన్యాసం’. ఈ రెండు చిత్రాలు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘మృత్యుంజయ్‌’ చిత్రానికి హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్‌ మరోసారి కథానాయికగా నటిస్తోంది. సందీప్‌ గుణ్ణం,  వినయ్‌ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ కొత్త పోస్టర్‌తో తెలిపారు.
Mrithyunjay.jpg

శ్రీవిష్ణు నటిస్తున్న మరో చిత్రం ‘విష్ణు విన్యాసం’ కూడా విడుదలకు సిద్ధమైంది. నూతన దర్శకుడు యదునాథ్‌ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మిస్తున్నారు. నయన సారిక కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మేకర్స్‌ ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. అంటే ఈ నెలలో శ్రీ విష్ణు హీరోగా నటించిన రెండు చిత్రాలు వరుసగా రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. శ్రీవిష్ణు సినిమాలకు మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు అలాంటివి. ఈ నెల 27, 28 తేదీల్లో వేరే చిత్రాల విడుదల ఏమీ లేదు. దాంతో తన సినిమాతో తనకే పోటీ అన్నట్లు ఉంది. ఈ రెండు చిత్రాలు రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

vishnu.jpg

Updated Date - Feb 14 , 2026 | 03:23 PM