Sree Vishnu: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్నాడే
ABN , Publish Date - May 15 , 2026 | 07:05 PM
హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) సైలెంట్ అనీ అందరికీ తెలుసు. విశేషం ఏమంటే అంతే సైలెంట్‌గా సినిమాలు కూడా చేసుకుపోతున్నాడు. ఎప్పుడు మొదలుపెట్టాడో కానీ.. అప్పుడే పూర్తి కూడా చేసే పనిలో పడ్డాడు.
హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) సైలెంట్ అనీ అందరికీ తెలుసు. విశేషం ఏమంటే అంతే సైలెంట్‌గా సినిమాలు కూడా చేసుకుపోతున్నాడు. ఎప్పుడు మొదలుపెట్టాడో కానీ.. అప్పుడే పూర్తి కూడా చేసే పనిలో పడ్డాడు. అతగాడి వేగం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడం చాలా కామన్. ఒక్కసారి విజయం సాధించిన ఆ జోడి మళ్లీ కలస్తే కావాల్సినంత బజ్ ముందే క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలోనే మరోసారి సూపర్ హిట్ కామెడీ జోడి కలవబోతోంది. 'సామజవరగమన' సంచలన విజయం తర్వాత హీరో శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు మరోసారి కలసి పని చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాను శ్రీవిష్ణు సైలెంట్ గా ఫినిష్ చేస్తున్నట్లు టాక్.
శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో ఈసారి కూడా కామెడీ సినిమానే రాబోతోంది. ఆల్రెడీ షూటింగ్ హై స్పీడ్‌లో జరుగుతోందని తెలుస్తోంది. విచిత్రమేమిటంటే ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న టీమ్.. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌లో బిజీగా ఉందట. అసలు ఎప్పుడు మొదలైందో కూడా తెలియకుండానే మూవీ వేగంగా పూర్తి కూడా అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'సామజవరగమన'కు రచయితలైన భాను భోగవరపు, నందు సవిరిగానా ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇది మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నవీన్ యర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మొత్తానికి సైలెంట్ గా పనికానిచ్చేస్తూ శ్రీవిష్ణు పెద్ద సర్ ప్రైజే ప్లాన్ చేస్తున్నాడని సినీజనం అనుకుంటున్నారు. మరి సామజవరగమనలానే ఈ సినిమాతో కూడా ఈ కాంబో హిట్ కొడుతుందో లేదో చూడాలి.