స్రవంతి చొక్కారపు: కమిట్‌మెంట్‌ లేకుండా ఎదగలేమా? ఇంకో మార్గం ఉందా?

ABN , Publish Date - Feb 19 , 2026 | 10:10 AM

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌.. కమిట్‌మెంట్‌పై యాంకర్ స్రవంతి చొక్కారపు తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.

క్యాస్టింగ్‌ కౌచ్‌.. కమిట్‌మెంట్‌ (casting couch).. ఇది రెండు సినిమా ఇండస్ట్రీ లో నిత్యం వినిపించే పదాలు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు... హీరోయిన్లకు అవకాశాల పేర కమిట్‌మెంట్‌ అడుగుతారనే టాక్‌ ఎంతోకాలంగా నడుస్తూనే ఉంటుంది. చిత్ర పరిశ్రమలో ఇది ఉందో.. లేదో ఎవరూ చెప్పలేరు. కొందరు ఉందంటారు.. మరికొందరు అలాంటి సమస్యే లేదంటారు.

తాజాగా ఇదే విషయంపైౖ యాంకర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu) స్పందించారు. ఆమె నటించిన ‘హే బల్వంత్‌’ (hey balvanth) చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో కమిట్‌మెంట్‌ గురించి ఆమె మాట్లాడారు.



Sravas2.jpg
‘ఈ మధ్యనే ఓ యువతి సోషల్‌ మీడియాలో నాకు కామెంట్‌ పెట్టింది. ‘సినిమా పరిశ్రమలో కమిట్‌మెంట్‌ లేకుండా ఎదగలేమా?.. ఇంకో మార్గం ఏమైనా ఉందా’ అన్నది ఆ అమ్మాయి ప్రశ్న. ఒట్టు వేసి మరీ చెబుతున్నా.. నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. మన ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ఏ విషయంలో ఎవరూ బలవంతం చేయరు. అయితే పూర్తిస్థాయిలో నిజాయితీ ఉందని చెప్పలేను. ఆ సమయాన్ని బట్టి మనం ఎలా డీల్‌ చేస్తామనేది ముఖ్యం. నా సర్కిల్‌లో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఎవరూ లేరని, ఇండస్ట్రీలో అమ్మాయిలు సేఫ్‌గానే ఉన్నారని చెప్పాను’ అని స్రవంతి తెలిపింది. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి సినిమాల్లో ఆర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంటున్నారు స్రవంతి.

Updated Date - Feb 19 , 2026 | 02:27 PM