అగధ:  రహస్యాన్ని ఛేదించడం కోసం.. 

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:10 PM

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ'.

ఎమ్మెస్ రాజు (MS RAJU) దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ' (Agadha). శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహాదేవి గా కామాక్షి భాస్కర్ల నటిస్తన్నారు. ఇందులో కీలకమైన సింహా పాత్రలో శ్రవణ్ రెడ్డి  నటిస్తున్నారు. ఈ సినిమా లో ఆయన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేసారు.

ఈ కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని పోస్టర్ చూస్తే  తెలుస్తోంది.85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, మరియు దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్ (VFX) తో, 'అగధ' ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఎంఎస్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. 

Updated Date - Apr 23 , 2026 | 04:10 PM