'ప్రేయసి రావే' దర్శకుడి... 'పిఠాపురంలో...' ముచ్చట్లు...

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:01 PM

ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, హనుమంతు వంటి సూపర్ హిట్‌ చిత్రాలను రూపొందించిన దర్శకుడు చంద్రమహేశ్‌. ఆయన తాజా చిత్రం 'పిఠాపురంలో...' మే 1న విడుదల కాబోతోంది. నూతన నటీనటులతో పాటు సీనియర్‌ ఆర్టిస్టులు కీలక పాత్ర పోషించిన 'పిఠాపురంలో అలా మొదలైంది' సినిమా గురించి, తన కెరీర్‌ గురించి చంద్రమహేశ్‌ చెప్పిన విశేషాలు.

Chandra Mahesh

దర్శకుడు చంద్రమహేశ్‌ మిత్రులతో కలిసి నిర్మించిన చిత్రం 'పిఠాపురంలో...'. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తన తొలి చిత్రం 'ప్రేయసి రావే' అంతటి పేరును, విజయాన్ని అందిస్తుందని చంద్ర మహేశ్‌ చెబుతున్నారు. పదేళ్ళుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కెరీర్‌లోని ఎత్తుపల్లాల గురించి ఆసక్తికరమైన అంశాలను వివరించారు. చంద్రమహేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పిఠాపురంలో' మూవీ విడుదల సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ముఖాముఖి.

Updated Date - Apr 13 , 2026 | 04:06 PM