Shruti Haasan: ఆ దేవత వలనే నా కెరీర్ మలుపు తిరిగింది

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:20 PM

లోకనాయకుడు గారాల పట్టి శృతిహాసన్ (Shruti Haasan).. ఈ పేరు వింటేనే ఒక ఎనర్జీ గుర్తొస్తుంది. కేవలం హీరోయిన్‌గానే కాదు, సింగర్‌గా, మ్యూజిషియన్‌గా ఆమె ప్రయాణం ఎప్పుడూ ఒక సెన్సేషనే.

Shruti Haasan

లోకనాయకుడు గారాల పట్టి శృతిహాసన్ (Shruti Haasan).. ఈ పేరు వింటేనే ఒక ఎనర్జీ గుర్తొస్తుంది. కేవలం హీరోయిన్‌గానే కాదు, సింగర్‌గా, మ్యూజిషియన్‌గా ఆమె ప్రయాణం ఎప్పుడూ ఒక సెన్సేషనే. ఒకానొక దశలో శృతి కెరీర్ ముగిసిపోయింది, ఇక ఈమెకు అవకాశాలు రావడం కష్టం అని విమర్శకులు మాట్లాడిన ప్రతిసారీ.. ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్‌తో అందరి నోళ్లు మూయిస్తూనే ఉంది. రీసెంట్‌గా ఆమె పాడిన సంచారి పాట సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కెరీర్ పరంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న శృతి, వ్యక్తిగత విశ్వాసాల విషయంలో మాత్రం కమల్ హాసన్‌ (Kamal Haasan)కు పూర్తి విరుద్ధంగా ఉంది.


లోకనాయకుడు కమల్ హాసన్ గురించి మనకు తెలుసు, ఆయన ఒక పక్కా నాస్తికుడు. మానవత్వమే అన్నింటికంటే గొప్పది.. దేవుడు ఉంటే బాగుంటుంది అని కోరుకునే వాడినే తప్ప, ఉన్నాడని నమ్మేవాడిని కాదు అని ఆయన చాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కానీ శృతిహాసన్ ఆలోచనలు మాత్రం వేరు. ఆమెకు దేవుడంటే అపారమైన నమ్మకం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవితంలో వారాహి అమ్మవారి ప్రభావం చాలా ఉందని శృతి వెల్లడించింది. ముఖ్యంగా చెన్నై మయిలాపూర్‌లో ఉన్న వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే తన కెరీర్ మలుపు తిరిగిందని ఆమె బలంగా నమ్ముతోంది. ఆ ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో తెలియని శక్తి తనను ఆవహిస్తుందని, అది తనను ముందుకు నడిపిస్తుందని శృతి ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు, అస్సాంలోని శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా ఆమె తరచుగా సందర్శిస్తుందట. తనలోని మానసిక ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ఆ ఆధ్యాత్మిక చింతనే కారణమని ఆమె చెబుతోంది. తండ్రి నాస్తికుడైనా, కూతురు మాత్రం ఇలా ఆధ్యాత్మిక బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతిహాసన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. గతంలో ఇద్దరితో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఈ భామ, ప్రస్తుతం ప్రేమ వ్యవహారాలకు స్వస్తి చెప్పి కేవలం కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన ట్రైన్‌ అనే వైవిధ్యమైన చిత్రంలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్: పార్ట్ 2 కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. వీటితో పాటు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది శృతి. ఈ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. చూస్తుంటే శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్.. ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే డబుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నట్లు అనిపిస్తోంది.

Updated Date - Apr 28 , 2026 | 04:28 PM