ఇండియన్ మూవీస్‌కు గల్ఫ్ మార్కెట్‌లో గట్టి దెబ్బ
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:42 PM
ఇరాన్ పై అమెరికా దాడులతో 'మిడిల్ ఈస్ట్ కంట్రీస్' వణికి పోతున్నాయి... యుద్ధవాతావరణం నెలకొంది... ఈ ప్రభావం మన ఇండియన్ మూవీస్ పై తీవ్రంగా ఉంటుందనీ వినిపిస్తోంది... భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ టాక్.
మన భారతీయ సినిమా ప్రస్తుతం అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది... ఒకప్పుడు కేవలం హిందీ సినిమాలకే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండేది... కానీ, ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర సౌత్ లాంగ్వేజెస్ మూవీస్ కు కూడా ఇంటర్నేషనల్ ఎరీనాలో మంచి ఆదరణ లభిస్తోంది... ఇరాన్ పై అమెరికాదు దాడుల్లో ఆ దేశ ప్రధాన నాయకుడు ఆయాతుల్లా ఖమేనీ మరణించారు... దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేయాలని ఆశిస్తోంది... అయితే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లుతుందనీ హెచ్చరించారు ట్రంప్... దాంతో యుద్ధవాతావరణం నెలకొంది... మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రజలు భయాందోళనతో ఉన్నారు... ఈ నేపథ్యంలో రాబోయే ఇండియన్ మూవీస్ కు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పెద్ద దెబ్బ పడనుందని అంటున్నారు పరిశీలకులు... మార్చి 19వ తేదీన క్రేజీ ప్రాజెక్ట్స్ 'ధురంధర్ -2', 'టాక్సిక్' చిత్రాలు రిలీజ్ కావలసి ఉంది... ఈ రెండు చిత్రాలకు గల్ఫ్ దేశాలైన కువైట్, దుబాయ్ వంటి కేంద్రాలలో మంచి బిజినెస్ జరిగింది... అంతేకాదు, ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు...
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కువైట్, దుబాయ్ వంటి దేశాల్లో మన సౌత్ ఇండియన్ మూవీస్ కూడా మంచి ఆదరణ పొందుతూ ఉంటాయి.. ముఖ్యంగా తెలుగు సినిమాలకు సైతం ఈ మిడిల్ ఈస్ట్ సిటీస్ లో విశేషమైన క్రేజ్ ఉంది... ఈ నేపథ్యంలో మార్చి 26న రాబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'పైనా ఈ యుద్ధ వాతావరణం కారణంగా దెబ్బ పడే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు... మార్చిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్స్ పైనే కాదు ఏప్రిల్ లో వెలుగు చూడనున్న 'డెకాయిట్', 'పెద్ది' సినిమాలపైనా ఈ ఎఫెక్ట్ ఉంటుందని టాక్.
అమెరికా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం అంటూ ఖమేనీ తరువాత వచ్చిన వారు అంటున్నారు... అంతేకాదు అమెరికా ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోనుందనీ ఇరాన్ నాయకులు చెబుతున్నారు... అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత ఘాటుగా స్పందిస్తున్నారు... ఇరాన్ దాడులకు దిగితే ఇంకెంతో నష్టపోతుందని పదే పదే హెచ్చరిస్తున్నారు... ఇలా ఇరు దేశాల కారణంగా ఇరాన్ పొరుగునే ఉన్న సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల్లో ఇండియన్ మూవీస్ కు గట్టి దెబ్బ పడనుంది... తరువాత వచ్చే సినిమాల సంగతేమో కానీ మార్చి 19న ముందుగా వచ్చే క్రేజీ ప్రాజెక్ట్స్ 'ధురంధర్-2', 'టాక్సిక్'పై ప్రభావం ఉంటుందని ట్రేడ్ పండిట్స్ మాట... ఏప్రిల్ 10న 'డెకాయిట్', 30న 'పెద్ది' చిత్రాలు రిలీజ్ కావాలి... ఈ లోగా యుద్ధ వాతావరణం సద్దుమణిగితే బాగుంటుందని ఆశిస్తున్నారు... ఏమవుతుందో చూడాలి.
Read Also: బూటుకాలుతో తన్నులు కూడా తిన్నాను!
Read Also: థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గట్టి పోటీ