సోషల్ మీడియాలో తీవ్ర విషాదం.. అగ్గిపెట్టె మచ్చ మృతి

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:22 PM

సోషల్ మీడియా ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు మీమ్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటర్నెట్ సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ ఇకలేడు.

Aggipetti Macha

సోషల్ మీడియా ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు మీమ్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటర్నెట్ సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చ(Aggipetti Macha) అలియాస్ కిరణ్ కుమార్ ఇకలేడు. గత ఐదు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతిలోని ప్రసిద్ధ స్విమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. బ్రైన్ డెడ్ అయ్యి, పరిస్థితి విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.


కిరణ్ కుమార్ మృతి చెందాడనే వార్త బయటకు రావడంతో తిరుపతిలోని వైఎస్సార్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీలోని నివాసానికి కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే మీమ్స్, వినూత్నమైన మ్యానరిజమ్‌తో తెలుగు నెటిజన్లకు విపరీతమైన వినోదాన్ని పంచిన కిరణ్ కుమార్, ఇలా చిన్న వయసులోనే హఠాత్తుగా అనారోగ్యంతో దూరమవ్వడం నెటిజన్స్, ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.


సోషల్ మీడియా వేదికలపై ఆయనకు సంబంధించిన వీడియోలు, క్లిప్పింగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. పలు టీవీ షోలలో కూడా కనిపించి అలరించిన ఆయన అకాల మరణం పట్ల మీమర్స్, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అగ్గిపెట్టె మచ్చ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

Updated Date - Oct 07 , 2026 | 06:22 PM