లిప్ కిస్ తో చైతన్యకి శోభిత బర్త్ డే విషెస్..
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:57 PM
అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి చైకి అభిమనులతో పాటు సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి చైకి అభిమనులతో పాటు సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక చైతన్య పుట్టినరోజున ఆయన భార్య శోభిత ధూళిపాళ (Sobhita) చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. చై- శోభిత కలిసి ఉన్న రేర్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. చైకి లిప్ కిస్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది శోభిత. అంతేకాకుండా ఈ ఫోటోలకు ఆమె అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. హ్యాపీ బర్త్‌డే లవర్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇటీవల వృషకర్మ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత గురించి ఒక్కమాటలో చెప్పాలంటే లవ్ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు అన్నట్లుగా ఇప్పుడు శోభిత కూడా హ్యాపీ బర్త్‌డే లవర్ అంటూ విషెస్ చెప్పడం ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని, ప్రేమను స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఫోటోలో వీరిద్దరి జంట ఎంతో క్యూట్‌గా, రొమాంటిక్ వైబ్‌తో కనిపిస్తుండటంతో పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య.. సమంతతో విడిపోయాకా.. శోభిత ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ డేటింగ్ చేస్తోన్న సమయంలోనే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.
ఇక ఆ రూమర్స్ ని నిజం చేస్తూ.. ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి చై.. శోభితని పెళ్లాడాడు. శోభితతో పెళ్లి తరువాత చైలో చాలా మార్పు వచ్చింది అని చెప్పొచ్చు. ఆ విషయాన్ని చై కూడా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా తన స్టైల్ మొత్తం మారిపోయిందని, సగం వార్డ్ రోబ్ ని శోభిత కంట్రోల్ లోకి తీసుకుందని చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలు చూసిన అక్కినేని ఫ్యాన్స్.. ఈ జంట ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చైతన్య వృషకర్మ సినిమాతో బిజీగా ఉండగా.. శోభిత తమిళ్ లో వెట్టువమ్ చిత్రంలో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ జంట ఎలాంటి విజయాలని అందుకుంటుందో చూడాలి.