ఆ విషయంలో భర్త జోక్యం అవసరం లేదంటున్న అక్కినేని కోడలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:47 AM

అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ను వివాహం చేసుకున్న తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita) అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంకోపక్క తన వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తోంది.

Sobhita Akkineni

అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ను వివాహం చేసుకున్న తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita) అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంకోపక్క తన వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తోంది. పెళ్లి తరువాత శోభిత నటించిన చీకటిలో వెబ్ సిరీస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పెళ్లికి ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఆమె నటనకు సంబంధించిన ప్రాజెక్టులను కాస్త తగ్గించినప్పటికీ, చిత్ర పరిశ్రమకు మాత్రం పూర్తిగా దూరం కాలేదు. ప్రస్తుతం ఆమె కొన్ని ఓటీటీ ప్రాజెక్టులు, తమిళ సినిమాలకు సైన్ చేస్తున్నప్పటికీ, తెలుగు సినిమాలకు మాత్రం చాలా వరకు దూరంగానే ఉంటూ వస్తోంది. అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వైవాహిక జీవితానికి సంబంధించి శోభిత చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితకు.. 'మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసే ముందు లేదా కథలు వినేటప్పుడు మీ భర్త నాగచైతన్య అనుమతి తీసుకుంటారా? ఆయనతో స్క్రిప్ట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారా?' అనే ప్రశ్న శోభితకు ఎదురైంది. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా చాలా స్పష్టంగా, కరాఖండిగా 'అస్సలు లేదు!' అని సమాధాన మిచ్చింది. తామిద్దరం ఒకరి వృత్తిపరమైన స్వేచ్ఛను మరొకరు గౌరవించుకుంటామని, కెరీర్ పరంగా ఎవరి నిర్ణయాలు వారే స్వతంత్రంగా తీసుకుంటామని శోభిత తేల్చిచెప్పింది.


తాము ఇద్దరం ఇంట్లో తమ పనుల గురించి మాట్లాడుకున్నప్పటికీ, ఒకరి కెరీర్ నిర్ణయాల్లో మరొకరు అస్సలు జోక్యం చేసుకోమని, కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేటప్పుడు ఒకరి అనుమతి మరొకరు అస్సలు ఆశించమని ఆమె తెలిపింది. నాగచైతన్య తన వృత్తిపరమైన నిర్ణయాలను ఎలాగైతే స్వతంత్రంగా తీసుకుంటాడో, అలాగే తాను కూడా కథలను సొంతంగా విశ్లేషించుకుని తన సొంత నిర్ణయాల ప్రకారమే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తానని శోభిత స్పష్టం చేసింది. అక్కినేని కోడలైనంత మాత్రాన తన కెరీర్ డెసిషన్స్ కోసం భర్త పర్మిషన్ అవసరం లేదని, ఎవరి కెరీర్ ని వారు బిల్డ్ చేసుకోవడం తప్పులేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి పెళ్లి తరువాత చై వందకోట్ల హీరోగా మారాడు.. మరి శోభితకు హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Updated Date - Jul 17 , 2026 | 10:49 AM