Sobhita Akkineni: అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:12 PM

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Sobhita Dhulipala

అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. చైతూ-శోభిత జంట విషయంలోనూ గత కొంతకాలంగా శోభిత గర్భవతి అంటూ రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ, శోభిత తన భర్త చైతన్యకు వంట చేసి పెట్టిన ఫొటో షేర్ చేసినా లేక ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది.


అయితే తాజాగా ఈ రూమర్లన్నింటికీ గట్టి చెక్ పడింది. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు నాగచైతన్య, శోభిత జంటగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో శోభిత ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని ఎంతో సంప్రదాయబద్ధంగా, అందంగా మెరిసిపోయింది. అనంతరం ఈ పెళ్లికి ఆమె ధరించిన చీరతో కొన్ని ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుకుంది.


ఆ ఫోటోలలో శోభిత తన నడుము స్పష్టంగా కనిపించేలా ఫోజులిచ్చింది. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్‌గా ఉంటే కొంచెమైనా బేబీ బంప్ కనిపించాలి కదా, కానీ అలాంటిదేమీ లేకపోవడంతో ఆమె గర్భవతి కాదని స్పష్టమైంది. గత కొంతకాలంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టడానికే శోభిత ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా.. అలా కనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అక్కినేని కోడలు అభిమానులకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్పనుందో చూడాలి.

Updated Date - Aug 17 , 2026 | 04:21 PM