Sobhita Dhulipala: మళ్లీ రెచ్చిపోయిన అక్కినేని కోడలు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:47 PM
శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే అమ్మది గురించి తెలుగులో ఎవరికి తెలిసింది లేదు.
శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే అమ్మది గురించి తెలుగులో ఎవరికి తెలిసింది లేదు. తెనాలి అమ్మాయి అయినా కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 'మేడ్ ఇన్ హెవెన్', 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్', 'మంకీ మ్యాన్' లాంటి సినిమాలతో అన్నీ భాషల్లో శోభిత తన సత్తా చాటింది. అయినా కూడా ఆమె తెలుగువారికి పరిచయమైంది మాత్రం అక్కినేని నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ గానే. వీరిద్దరి డేటింగ్ వార్తల తరువాతనే శోభిత ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకు తెల్సింది. ఇక వీరి ప్రేమ పెళ్లిగా మారి.. శోభిత అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలు అందుకుంది.
పెళ్లి తరువాత పద్ధతిగా కనిపించడంతో.. శోభిత గత జీవితాన్ని, ఆమె అందాల ఆరబోతని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మరోసారి అక్కినేని కోడలి బోల్డ్ లుక్ గురించి నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అందుకు కారణం.. శోభిత పెళ్లి తర్వాత తొలిసారిగా అత్యంత బోల్డ్‌గా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మ్యాగజైన్ కవర్ పేజీ కోసం స్టైలిష్ ఫోటోషూట్ చేయడమే. ఈ కవర్ పేజీ కవర్ లుక్‌లో క్రాప్డ్ గ్రే ఫాక్స్ ఫర్ జాకెట్, బ్లాక్ బ్రీఫ్స్, క్రిస్టల్ పెండెంట్ ఉన్న స్కల్ప్టెడ్ గోల్డ్ బెల్ట్‌తో ఎడ్జీ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరించింది. అలాగే బ్లాక్ హాల్టర్ విత్ స్ట్రాపీ కట్-అవుట్స్, ప్లమ్ బాడీసూట్, మెజెంటా వన్-షోల్డర్ డ్రేప్‌తో పాటు క్రిస్టల్-ఫ్రింజ్డ్ థై-హై బూట్స్‌లో శోభితా కనిపించిన తీరు ఒక స్టైలింగ్ మాస్టర్‌క్లాస్‌ను తలపించింది. స్మోకీ ఐస్, న్యూడ్ లిప్స్‌తో మెరిసిన ఆమె లేటెస్ట్ లుక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసి నెటిజన్స్ మళ్లీ రెచ్చిపోయిన అక్కినేని కోడలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, శోభితా ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న వెట్టువమ్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలోని తన పాత్రపై మాట్లాడిన శోభితా, 'ఈ రోల్ కోసం నా సర్వస్వం ధారపోసాను. చాలా రోజులుగా ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసమే దేవుడిని ప్రార్థిస్తున్నాను'అని తెలిపింది. బోల్డ్ స్టైల్‌తో పాటు పవర్ ఫుల్ పాత్రలతో దూసుకుపోతున్న శోభితా లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ సినిమాతో శోభిత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.