Cheekatilo Trailer: సీరియల్ కిల్లర్ కోసం వేట మొదలుపెట్టిన అక్కినేని కోడలు..

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:55 PM

అచ్చ తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అక్కినేని ఇది పెద్ద కోడలిగా మారిన విషయం తెల్సిందే.

Cheekatilo Trailer

Cheekatilo Trailer: అచ్చ తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అక్కినేని ఇది పెద్ద కోడలిగా మారిన విషయం తెల్సిందే. పెళ్లికి ముందు శోభితా ఎలా ఉంది అనేది ఇప్పుడు అనవసరం. పెళ్లి తరువాత ఆమె ఎలా ఉంటుంది అనేది మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. పెళ్లి తరువాత శోభితాలో చాలా మార్పు వచ్చింది. అత్త అమలలాగా ఇంటికే పరిమితమవుతుందేమో అనుకున్నారు. కానీ, శోభితా మాత్రం.. పెళ్లి తరువాత సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అయితే అంతకుముందులా అందాల ఆరబోతను కట్టిపెట్టి.. మంచి కథలను ఎంచుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా తెరకెక్కిన చిత్రం చీకటిలో(Cheekatilo).

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా తెరకెక్కిన చీకటిలో సినిమాకు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. విశ్వదేవ్ రాచకొండ, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 23 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా చీకటిలో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

సంధ్య.. ఒక న్యూస్ ప్రజెంటర్. కానీ, ఆ ఛానెల్ హెడ్ డబ్బు కోసం తప్ప న్యాయం కోసం పనిచేయనివ్వడు. దీంతో సంధ్య.. ఇంట్లోనే చీకటిలో అనే పేరుతో ఒక పాడ్ క్యాస్ట్ పెడుతుంది. వరుసగా అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ గురించి జరిగే విచారణను, అతను చేస్తున్న అకృత్యాలను ఆమె క్రైమ్ స్టోరీగా చెప్తూ ఉంటుంది. ఇంకోపక్క ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఆ సీరియల్ కిల్లర్ చేతిలో సంధ్య తన బెస్ట్ ఫ్రెండ్ ని కూడా పోగొట్టుకుంటుంది. దీంతో ఎలాగైనా అతడిని పట్టుకోవడానికి ఆమె ఏం చేసింది. అసలు సీరియల్ కిల్లర్ ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు..? కేవలం అతనిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసినందుకే ఒక అమ్మాయిని చంపిన హంతకుడు పాడ్ క్యాస్ట్ పెట్టిన సంధ్యను ఏం చేశాడు.. ? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఇప్పటివరకు చాలా క్రైం థ్రిల్లర్స్ వచ్చాయి. అందులో ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. శోభితా లుక్ చాలా బావుంది. చైతన్య కృష్ణ పోలీస్ గా కనిపించగా.. శోభిత బాయ్ ఫ్రెండ్ గా విశ్వ దేవ్ కనిపించాడు. పెళ్లి తరువాత అక్కినేని కోడలు నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్కినేని కోడలు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jan 12 , 2026 | 03:57 PM