అయ్యయ్యో.. జూనియర్ ఐశ్వర్యరాయ్ జీవితంలో ఇన్ని కష్టాలా
ABN , Publish Date - May 23 , 2026 | 05:57 PM
స్నేహ ఉల్లాల్ (Sneha Ullal).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా లాంటి సినిమాలతో ఆమె తెలుగులో మంచిగుర్తింపును అందుకుంది.
స్నేహ ఉల్లాల్ (Sneha Ullal).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా లాంటి సినిమాలతో ఆమె తెలుగులో మంచిగుర్తింపును అందుకుంది. బాలీవుడ్ లో అయితే అమ్మడికి జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరు కూడా ఉంది. పిల్లి కళ్ళతో ఐశ్వర్య రాయ్ ని పోలి ఉండడంతో ఆమెను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలిచేవారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇండస్ట్రీని వదిలేసింది.
సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు దగ్గరగానే ఉంటున్న స్నేహ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాను సినిమాల్లోకి ఇష్టంతో రాలేదని, రాజీపడి వచ్చినట్లు ఆమె తెలిపింది. ' నేను 16 ఏళ్ళకే సినిమాల్లోకి అడుగుపెట్టాను. పదోతరగతి పూర్తిచేసి కాలేజీలో చేరాను. అక్కడ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత నన్ను చూసి లక్కీ సినిమా ఆడిషన్స్ లో నా గురించి చెప్పగా .. మూవీ టీమ్ నన్ను సంప్రదించారు. అలా లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాకు ఎంపిక అయ్యాను.
ఆ సినిమాను నేను రాజీ పడి ఒప్పుకున్నాను. అప్పటికీ మా అమ్మకు క్యాన్సర్. ఇంట్లో పరిస్థితులు బాలేదు. కనీసం నేను ఈ సినిమా ఒప్పుకుంటే.. కుటుంబాన్ని సంతోష పెట్టిందాన్ని అవుతాను. వాళ్ళను వేరే వేరే చోట్లకు తిప్పగలను అని అనుకోని సినిమాకు ఓకే చెప్పాను. 16 ఏళ్ళకే నేను పెద్దదానిలా బాధ్యతలు చేపట్టాను. దీనివలన నా టీనేజ్ ని నేను మిస్ అయ్యాను. ఆ టైమ్ లోనే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఇండస్ట్రీ మీద ఉన్న భయంతో నేనే ఒప్పుకోలేదు. చాలామంది నాకు ఈ ఇండస్ట్రీ అసభ్యకరమైందని చెప్పారు. దాంతో పాటు నేను అంత గ్లామర్ గా ఉండను అని నా అభిప్రాయం. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యాను' అని చెప్పుకొచ్చింది. ఇక స్నేహ ఉల్లాల్ కథ విన్నాకా నెటిజన్స్ .. అఅయ్యయ్యో.. జూనియర్ ఐశ్వర్యరాయ్ జీవితంలో ఇన్ని కష్టాలా అని కామెంట్స్ చేస్తున్నారు.