Allu Sneha reddy: అల్లు అర్జున్ భార్యగా ఎంట్రీ.. ఇప్పుడు సొంత బ్రాండ్‌తో స్నేహారెడ్డి క్రేజ్!

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:31 PM

సినీ ప్రపంచంలో స్టార్ హీరోల జీవిత భాగస్వాములపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.

సినీ ప్రపంచంలో స్టార్ హీరోల జీవిత భాగస్వాములపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అలాంటి వారిలో ఒకరు.  అల్లు అర్జున్ భార్యగానే  కాకుండా  వ్యాపారవేత్తగా, తల్లిగా, ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, డిజిటల్‌ పర్సనాలిటీగా ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. సోషల్‌ మీడియాలో స్నేహా రెడ్డికి భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు, ఫ్యాషన్‌, ట్రావెల్‌, ఫిట్‌నెస్‌ అప్‌డేట్స్‌కు మంచి స్పందన లభిస్తుంటుంది. ప్రస్తుతం ఆమెను సోషల్‌ మీడియాలో 91 లక్షలకు పైగా ఫాలోవర్లు  ఉన్నారు. దీంతో సినీ కుటుంబానికి చెందిన సెలబ్రిటీగానే కాకుండా, సొంతంగా అభిమానులను సంపాదించుకున్న డిజిటల్‌ పర్సనాలిటీగా ఆమె పేరు తెచ్చుకున్నారు. వ్యాపార రంగంలోనూ స్నేహా రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న ‘పికాబూ’ (Picaboo) స్టూడియో ఈ  ప్రయాణంలో కీలకమైన భాగంగా నిలిచింది. కుటుంబ నేపథ్యం, సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ తన ఆసక్తులకు అనుగుణంగా వ్యాపార రంగంలో ముందుకు సాగడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరోవైపు స్నేహా రెడ్డి ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వర్కౌట్స్‌, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమె యాక్టివ్‌ లైఫ్‌స్టైల్‌ కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది. కుటుంబం విషయంలోనూ స్నేహా రెడ్డి ఎంతో శ్రద్ధ చూపుతారు. అల్లు అర్జున్‌తో కలిసి పిల్లలు అయాన్‌, అర్హతో గడిపే ప్రత్యేకమైన క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. పిల్లలతో కలిసి చేసే ట్రిప్స్‌, సెలబ్రేషన్స్‌, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటాయి.

 

Updated Date - Sep 29 , 2026 | 06:38 PM