Sky: రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'స్కై'

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:37 PM

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'స్కై'. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. 



మురళీ కృష్ణంరాజు(Murali Krishnam Raju), శృతి శెట్టి (Shruthi Shetty), ఆనంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'స్కై' (Sky). పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు.  ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 


నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 'స్కై' సినిమా కంటెంట్, సాంగ్స్ చూశాను. మూవీలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ తోనే మూవీ ఎస్సెన్స్ తెలుస్తోంది' అన్నారు.

డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ - "స్కై" సినిమా షూటింగ్ కు ముందే అన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం.  డీవోపీ రసూల్ గారు ఇచ్చిన సజెషన్స్ తో సినిమాను అనుకున్న టైమ్ లో కంఫర్ట్ గా కంప్లీట్ చేయగలిగాం. ఆయన గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది' అన్నారు.

హీరో మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ - ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ శివ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి రాగలిగాడు. మా సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కింది. థియేట్రికల్ గా కూడా ఇదే సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

శృతి శెట్టి మాట్లాడుతూ 'ఈ చిత్రంలో హీరోయిన్ ది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్' అన్నారు.
 

Updated Date - Feb 01 , 2026 | 02:37 PM